రిలయన్స్‌లో ఎఫ్‌పీఐ, ఎల్‌ఐసీలకు మరింత వాటా
close

Published : 24/10/2021 02:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిలయన్స్‌లో ఎఫ్‌పీఐ, ఎల్‌ఐసీలకు మరింత వాటా

విదేశీ, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌)లో వాటాను సెప్టెంబరు త్రైమాసికంలో పెంచుకున్నారు. ఆ సంస్థ టెలికాం, రిటైల్‌ వ్యాపారాల్లో వృద్ధికి మరింత అవకాశం ఉందనే అంచనాలే ఇందుకు కారణం. దీంతోపాటు సౌదీ అరేబియా దిగ్గజం అరామ్‌కోకు వాటా విక్రయ ప్రక్రియలో పురోగతి, సరికొత్త హరిత ఇంధన వ్యాపార ప్రణాళికలు కూడా ఇందుకు ఉపకరించాయి. బీమా కంపెనీలు వరుసగా మూడో త్రైమాసికంలోనూ ఆర్‌ఐల్‌లో తమ వాటా పెంచుకున్నాయి. సెప్టెంబరు త్రైమాసికంలో నిఫ్టీ 50 సూచీ 12 శాతం వృద్ధి సాధిస్తే, ఆర్‌ఐఎల్‌ షేరు 19 శాతం రాణించడం గమనార్హం. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే సరికి ఆర్‌ఐఎల్‌ షేరు రూ.2627 వద్ద స్థిరపడగా, సంస్థ మార్కెట్‌ విలువ రూ.16.94 లక్షల కోట్లుగా ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని