GST: గడిచిన నెల జీఎస్‌టీ రిటర్నులు దాఖలు చేయకుంటే.. - non filers of monthly GST return to be barred from filing GSTR1
close

Published : 18/09/2021 20:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

GST: గడిచిన నెల జీఎస్‌టీ రిటర్నులు దాఖలు చేయకుంటే..

జీఎస్‌టీఆర్‌-1 సమర్పణకు అనుమతి ఉండదు

దిల్లీ: గడిచిన నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్‌-3బీ రిటర్నులను దాఖలు చేయని వ్యాపారులు జనవరి 1 నుంచి జీఎస్‌టీఆర్‌-1లో బయటకు పంపే సరఫరాలను నమోదు చేయడానికి వీలుండదని జీఎస్‌టీఎన్‌ స్పష్టం చేసింది. ఏదైనా నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్‌-1ను దాఖలు చేయడానికి తర్వాతి నెలలో 11వ రోజు వరకు గడువు ఉంటుంది. ఇక జీఎస్‌టీఆర్‌-3బీ(పన్ను చెల్లింపుల ఫారమ్‌) రిటర్నులను తర్వాతి నెలలో 20-24 రోజుల మధ్యలో చేస్తారన్న సంగతి తెలిసిందే. జీఎస్‌టీఆర్‌-1 రిటర్నులను దాఖలు చేయడంలో పరిమితిని విధించే సెంట్రల్‌ జీఎస్‌టీ నిబంధనల్లోని రూల్‌-59(6) జనవరి 1, 2021 నుంచి అమల్లోకి వస్తుందని జీఎస్‌టీకి సాంకేతికత సహకారం అందిస్తున్న జీఎస్‌టీఎన్‌ స్పష్టం చేసింది. ఈ నిబంధన ప్రకారం.. ఒక నమోదిత వ్యక్తి.. గడచిన నెలకు ఫారమ్‌ జీఎస్‌టీఆర్‌-3బీ రిటర్నులు దాఖలు చేయకపోతే.. ఫారమ్‌ జీఎస్‌టీఆర్‌-1లో వస్తువులు లేదా సేవలు లేదా రెండింటి సరఫరా (అవుట్‌వర్డ్‌)లను నమోదు చేయడానికి అనుమతి ఉండదు. అలాగే క్రితం నెల జీఎస్‌టీ చెల్లించడంలో విఫలమైనా.. జీఎస్‌టీఆర్‌-1ను దాఖలు చేయలేరు.

అలాగే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. లేదంటే రిఫండులకు దాఖలు చేయడం కుదరదు. రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవడానికి కూడా అనుమతి ఉండదు. శుక్రవారం భేటీ అయిన జీఎస్టీ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ చెల్లింపుల ఎగవేతను నివారించడానికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మండలి తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని