టీసీఎస్‌.. మళ్లీ నెంబర్‌ 1 - once again tcs becomes the most valued it firm
close

Published : 25/01/2021 22:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీసీఎస్‌.. మళ్లీ నెంబర్‌ 1

దిల్లీ: దేశీయ దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ఐటీసంస్థగా అవతరించింది. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ అసెంచర్‌ను దాటి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం ఉదయం టీసీఎస్‌ మార్కెట్‌ విలువ 169.9 బిలియన్‌ డాలర్లు దాటడంతో సంస్థ ఈ ఘనత దక్కించుకుంది. 

కాగా.. గతేడాది అక్టోబరులో టీసీఎస్‌ తొలిసారిగా అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. అప్పుడు కూడా అసెంచర్‌ను దాటి సంస్థ ఈ రికార్డు సాధించింది. ఆ తర్వాత కంపెనీ షేరు విలువ పడిపోవడంతో మార్కెట్‌ విలువ తగ్గింది. దీంతో మళ్లీ రెండో స్థానానికి పడిపోయిన టీసీఎస్‌.. తాజాగా నంబర్‌ వన్‌ కంపెనీగా అవతరించింది. 

దేశంలోనూ అగ్రస్థానమే..

దేశంలోనూ అత్యంత విలువైన సంస్థగా టీసీఎస్‌ మళ్లీ తొలి స్థానానికి ఎగబాకింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను దాటి ఐటీ దిగ్గజం ఈ ఘనత సాధించింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో టీసీఎస్‌ షేరు ధర ఒక శాతానికి పెరిగి ఏడాది గరిష్ఠ స్థాయిలో ట్రేడ్‌ అవుతున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 12,45,341.44కోట్లకు చేరింది. ఇదే సమయంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ రూ. 12,42,593.78కోట్లుగా ఉంది. గతేడాది మార్చిలోనూ టీసీఎస్‌ మార్కెట్‌ విలువ పరంగా దేశంలో అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టీసీఎస్‌ రాణించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 7.2శాతం పెరిగింది. దీంతో గత కొన్ని రోజులుగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో టీసీఎస్‌ షేర్లు లాభాలను సాధిస్తున్నాయి. 

ఇవీ చదవండి..

ఆ నోట్లు రద్దు చేస్తారా? ఆర్బీఐ ఏమంటోంది 

దేశీయ తయారీకి బడ్జెట్‌లో ఊతం!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని