close

ప్రధానాంశాలు

విద్యుత్‌ ద్విచక్ర వాహనాల్లోకి టీవీఎస్‌

రూ.1.15 లక్షలతో ఇ-స్కూటర్‌

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: బెంగళూరు: విద్యుత్‌ ద్విచక్ర వాహనాల విభాగంలోకి అడుగుపెట్టినట్లు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ప్రకటించింది. రూ.1.15 లక్షల(ఆన్‌రోడ్‌ ధర-బెంగళూరు)తో ఇ-స్కూటర్‌ను తీసుకొచ్చినట్లు తెలిపింది. 4.4 కిలోవాట్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌తో వస్తున్న ఈ ‘టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌’ గరిష్ఠంగా గంటకు 78 కి.మీ. వేగంతో దూసుకెళుతుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే 75 కి.మీ. ప్రయాణం చేస్తుంది. 4.2 సెకన్లలో 0-40 కి.మీ./గంట వేగాన్ని అందుకుంటుంది. ఇందులో ఉండే టీవీఎస్‌ స్మార్ట్‌ఎక్సోనెక్ట్‌ ప్లాట్‌ఫాం ద్వారా జియో-ఫెన్సింగ్‌, రిమోట్‌ బ్యాటరీ ఛార్జ్‌ నేవిగేషన్‌ వంటి పలు ఫీచర్లను వినియోగదార్లకు అందిస్తోంది. ‘పర్యావరణం-అనుసంధానం’పై దృష్టి కేంద్రీకరించి.. తొలి విద్యుత్‌ వాహనాన్ని ప్రవేశపెడుతున్నామ’ని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.