Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్ సర్, నా పేరు అశోక్. నాకు 31 సంవత్సరాలు. నాకు మరియు నా భార్యకు టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ రెండింటినీ కలిగి ఉన్న పాలసీని మీరు సూచించగలరా? మరియు మెటర్నిటీని కలిగి ఉన్న ఏదైనా పాలసీ ఉందా?

Asked by ఆశొక్ కుమర్ on
మీరు, మీ భార్య ఇద్దరు ఉద్యోగస్తులు అయితే ఇద్దరు టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. లేదంటే మీ ఒక్కరే తీసుకోవచ్చు. టర్మ్ పాలసీ లో కొంత వరకు మాత్రమే ఆరోగ్య బీమా ఉంటుంది.  టర్మ్ పాలసీ లో రైడర్స్ రూపం లో ప్రమాద బీమా లాంటివి తీసుకోవచ్చు. అయితే, ఆరోగ్య బీమా విడిగా తీసుకోవడం మంచిది. అందులో మీకు పూర్తీ రక్షణ ఉంటుంది.  టర్మ్ పాలసీ కోసం మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.  ఆరోగ్య బీమా కోసం ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుని దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. కొన్ని పాలసీ లు మాత్రమే ప్రసూతి ఖర్చులు కవర్ చేస్తాయి, ప్రీమియం కొంత ఎక్కువగా ఉండవచ్చు. వాటిలో కూడా 2 నుంచి 4 ఏళ్ళ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పైన తెలిపిన కంపెనీ ల పాలసీ లు పరిశీలించండి. 

మరిన్ని

మీ ప్రశ్న