ఈ ఐపీఎల్‌లో చాలామంది విదేశీయులు తప్పుకుంటారు  - Aakash Chopra feels many overseas players may pull out of the IPL due to pandemic
close
Published : 29/07/2020 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ఐపీఎల్‌లో చాలామంది విదేశీయులు తప్పుకుంటారు 

ధావన్‌ విషయంలో టీమ్‌ఇండియా ఒక నిర్ణయానికి వచ్చింది: ఆకాశ్‌ చోప్రా

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ పరిస్థితుల కారణంగా ఈసారి ఐపీఎల్‌లో చాలా మంది విదేశీ ఆటగాళ్లు తప్పుకునే అవకాశం ఉందని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌చోప్రా అభిప్రాయపడ్డాడు. సెప్టెంబర్‌ 19 నుంచి  మెగా ఈవెంట్‌ యూఏఈలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తాజాగా ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన సందర్భంగా ఓ అభిమాని విదేశీ ఆటగాళ్లపై ఓ ప్రశ్న వేశాడు. ‘వైరస్‌ కారణంగా ఈసారి ఐపీఎల్‌ నుంచి చాలా మంది విదేశీయులు తప్పుకుంటారా? అని అడిగాడు. దానికి స్పందించిన అతడు.. ఇదో కష్టతరమైన ప్రశ్న అని.. ఎంత జాగ్రత్తగా బయోసెక్యూర్‌ విధానంలో నిర్వహించినా ఎక్కడో ఓ చోట ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పాడు. అందుకు ఇటీవల నిబంధనలను అతిక్రమించిన ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ను ఉదాహరణగా పేర్కొన్నాడు. ఇలాంటి వాతావరణంలో అందరిలోనూ ఏ మూలో భయం ఉంటుందని తెలిపాడు. అయితే, ఎవరూ అలాంటి పనులు చేయరని, అందరికీ ఐపీఎల్‌ ఆడాలని ఉందని చెప్పాడు. 

అనంతరం ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌పై మరో అభిమాని అడిగిన ప్రశ్నకు.. అతడో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ అని, ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడని చెప్పాడు. ప్రస్తుతం ఏ జట్టులోనూ అతడిలాంటి ఆటగాడు లేడన్నాడు. చివరగా ఇంకో అభిమాని శిఖర్‌ ధావన్‌ మళ్లీ టెస్టుల్లో ఆడతాడా అని అడగ్గా.. దానికీ సమాధానం ఇచ్చాడు. ధావన్‌ ఎప్పటికీ ఆడడని చెప్పలేమని, అయితే.. సమీప భవిష్యత్‌లో మాత్రం ఆడే అవకాశం లేదని తెలిపాడు. ఇప్పటికే టీమ్‌ఇండియాకు టెస్టు ఓపెనర్లుగా చాలా మంది ఉన్నారని గుర్తుచేశాడు. దీంతో భవిష్యత్‌లో ఎప్పుడైనా గబ్బర్‌‌ తిరిగి టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉందన్నాడు. ఈ విషయంలో టీమ్‌ఇండియా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుందని, కానీ దాన్ని మాత్రం అతడితో చర్చించలేదని చోప్రా అన్నాడు. అతడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బాగా ఆడతాడని, దాంతో ఆ ఫార్మాట్లపైనే దృష్టిసారించాలని మాజీ క్రికెటర్‌ సలహా ఇచ్చాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని