రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ - Actor Rajasekhar Health Bulletin from city neuro hospital
close
Updated : 27/10/2020 19:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌

హైదరాబాద్‌: కరోనాతో పోరాడుతూ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌లో చికిత్స పొందుతున్న సినీ నటుడు డాక్టర్‌ రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు మంగళవారం బులిటెన్‌ విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్‌ రత్నకిషోర్‌ తెలిపారు.

‘‘కరోనాతో బాధపడుతూ సిటీ న్యూరో సెంటర్‌లో చేరిన డాక్టర్‌ రాజశేఖర్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. తాజాగా ప్లాస్మా థెరపీ కూడా చేశాం. దాంతో పాటు, సైటోసోర్బ్‌ పరికరం ద్వారా చికిత్స చేస్తున్నాం. గతంతో పోలిస్తే, రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. మా వైద్య బృందం చేస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు’’ అని సిటీ న్యూరో సెంటర్‌ ప్రకటన విడుదల చేసింది.

కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన రాజశేఖర్‌ సతీమణి జీవిత ఇప్పటికే కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని