close

తాజా వార్తలు

Published : 30/11/2020 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మళ్లీ తెరపైకి ఆలియా పెళ్లి..!

రూ.32 కోట్లతో ఫ్లాట్‌ కొన్న నటి

ముంబయి: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియాభట్‌ తన ప్రియ స్నేహితుడు రణ్‌బీర్‌ కపూర్‌ని వివాహం చేసుకోనున్నారని గత ఏడాది నుంచి వార్తలు వస్తున్నాయి. ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. వీరి ప్రేమ, పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపినట్లు అప్పట్లో టాక్‌. అయితే, సదరు పెళ్లి వార్తల గురించి విలేకర్లు ఎన్నిసార్లు అడిగినా వీరిద్దరూ సమాధానం చెప్పకపోగా.. చిరునవ్వు చిందించేవాళ్లు.

రణ్‌బీర్ కపూర్‌ నివాసముంటున్న వాస్తు పాలీ హిల్‌ అపార్ట్‌మెంట్‌లోనే తాజాగా ఆలియాభట్‌ కూడా ఓ ఫ్లాట్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని కోసం ఆమె రూ.32 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. నటుడు షారుఖ్‌ ఖాన్‌ సతీమణి గౌరీఖాన్‌.. ఈ ఫ్లాట్‌కి సంబంధించిన ఇంటిరియల్ డిజైన్లు చూడనున్నారట. రణ్‌బీర్‌ ఇంటికి సమీపంలోనే ఆలియా కొత్తగా ఫ్లాట్‌ కొనుగోలు చేశారనే వార్తలు బయటకు రావడంతో వీరిద్దరి పెళ్లి ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాదిలో వీరిద్దరూ తప్పకుండా వివాహబంధంలోకి అడుగుపెడతారని అందరూ చెప్పుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం వీరిద్దరూ ‘బ్రహ్మాస్త్ర’లో నటిస్తున్నారు. మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తెలుగు తెరకు పరిచమయ్యేందుకు ఆలియా సిద్ధమవుతున్నారు.Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన