కేజ్రీవాల్‌పై అమరీందర్‌ సింగ్‌ ఫైర్‌! - Amarinder Singh warns Arvind Kejriwal
close
Published : 04/09/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేజ్రీవాల్‌పై అమరీందర్‌ సింగ్‌ ఫైర్‌!

దిల్లీ సీఎం ఆక్సీమీటర్ల వ్యాఖ్యలపై మండిపాటు

చండీగఢ్‌: పంజాబ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సీమీటర్లతో పర్యటించి కొవిడ్‌ బాధితులను గుర్తించాలంటూ ఆప్‌ కార్యకర్తలకు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చేసిన సూచనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ మండిపడ్డారు. ముందు దేశ రాజధాని దిల్లీలో కరోనా వ్యాప్తి అరికట్టడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. అలాగే ఆప్‌ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

‘‘మీ ఆక్సీమీటర్ల అవసరం మాకు లేదు. మా రాష్ట్ర ప్రజలను ఆస్పత్రికి వెళ్లడానికి భయపడే విధంగా చేస్తున్న మీ పార్టీ కార్యకర్తలను ముందు అదుపులో పెట్టుకోండి’’ అని సూచించారు. అయితే, ఇటీవల వైరల్‌ అయిన ఓ వీడియో పంజాబ్‌ ముఖ్యమంత్రి ఆగ్రహానికి కారణమైంది. ఆ వీడియోను సర్క్యులేట్‌ చేసిన కేసులో ఆప్‌ కార్యకర్త అరెస్ట్‌ కావడం, దానికి ఆజ్యం పోసేలా కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు ఉండడంతో అమరీందర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆ వీడియోలో ఏముంది..?

కొవిడ్‌ కారణంగా మరణించిన వ్యక్తుల నుంచి ఆస్పత్రి సిబ్బంది అవయవాలను తొలగిస్తున్నట్లు ఓ వీడియో ఇటీవల వైరల్‌ అయ్యింది. పంజాబ్‌ వైద్యారోగ్య సిబ్బందే ఈ పనిచేస్తున్నారంటూ ఆ ఫేక్‌ వీడియో సారాంశం. వాస్తవానికి అది పాకిస్థాన్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఆ వీడియోను ప్రచారం చేసినందుకు గానూ ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన అమరీందర్‌ సింగ్‌ (31) అనే కార్యకర్తను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ వీడియోను ఉద్దేశిస్తూ సీఎం మాట్లాడుతూ.. ఆరోగ్య సిబ్బందికి ప్రజలు సహకరించకుండా ఆప్‌ కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కొవిడ్‌తో పోరాడుతున్న వేళ పక్కా ప్రణాళికతో పంజాబ్‌ ప్రభుత్వంపై ఆప్‌ చేస్తున్న కుట్రగా అమరీందర్‌ అభివర్ణించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని