రూ.4వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ బలోపేతం - CM Jagan Review meets on marketing and YSR Poshan
close
Updated : 23/07/2020 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.4వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ బలోపేతం

సీఎం జగన్‌

అమరావతి: రాష్ట్రంలో రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. మార్కెటింగ్‌ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ప్రతీ ఆర్బీకే పరిధిలో గోదాములు, గ్రేడింగ్‌ యంత్రాలు, పరికరాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి మండలంలో ఓ శీతల గిడ్డంగి నిర్మించనున్నట్లు తెలిపారు. రైతులు పంటల సమాచారాన్ని రైతు భరోసా కేంద్రానికి తెలిపితే.. ఆ సమాచారం నేరుగా సెంట్రల్‌ సర్వర్‌కు చేరుతుందన్నారు. రైతు తన పంటను అమ్మకునేలా మార్కెటింగ్‌ శాఖ తోడ్పాటునందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కనీస గిట్టుబాటు ధర రాని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకోవాలన్నారు. సెప్టెంబర్‌కల్లా దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అంతకుముందు అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. పదిరోజుల్లో కార్యాచరణలోకి తీసుకురావాలన్నారు. స్కూళ్ల తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ 10 రకాల సదుపాయాలు ఉండాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల కార్యకలాపాలను మరింత పటిష్టం చేయాలని తెలిపారు.

గర్భిణీలు, బాలింతలు, 36 నెలల్లోపు శిశువులకు ఒకలాంటి కార్యలాపాలు, 36 నెలల నుంచి 72 నెలల పిల్లలకు మరో విధంగా ఉండాలని సీఎం అన్నారు. ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్కూళ్లలోనే ప్రీ ప్రైమరీ బోధన ఉంటే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. సక్రమంగా ఆలోచనలు చేసి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2 సిలబస్‌పైనా పరిశీలన చేయాలన్నారు. అంగన్‌వాడీ పిల్లల్లో లెర్నింగ్‌ స్కిల్స్‌ కోసం టూల్స్‌, టీవీ, ప్రత్యేక పుస్తకాలు ఉండాలన్నారు. ప్రసవం కాగానే మహిళలకు రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద అందించేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అమలు తీరుపై బలమైన పర్యవేక్షణ ఉండాలని అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని