శింబు-త్రిష వివాహం..? - Fans doubt as T Rajendar evades questions on Simbu Trishas wedding
close
Updated : 16/10/2020 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శింబు-త్రిష వివాహం..?

సమాధానం చెప్పని రాజేందర్‌‌

చెన్నై: ‘విన్నైతండి వరువాయ’ (తెలుగులో ఏమాయ చేశావే) చిత్రంలో కలిసి నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు నటీనటులు శింబు, త్రిష. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి చాలామంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఏడడుగులు వేయనున్నారంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ తాము మంచి స్నేహితులమే అని ఈ జంట సమాధానమిచ్చింది.

కాగా, లాక్‌డౌన్‌ సమయంలో త్రిష-శింబు కలిసి ‘కార్తీక్‌ డయల్‌ సేతా యెన్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ కోసం పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో ఓ శుభవార్త చెబుతానంటూ శింబు ఇటీవల ప్రకటించారు. దీంతో త్రిష-శింబు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరూ అతి త్వరలోనే వివాహం చేసుకోనున్నారంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి రిలేషన్‌ గురించి నెట్టింట్లో పలు పోస్టులు కూడా దర్శనమిస్తున్నాయి.

తాజాగా తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో ఈ ఏడాది శింబు తండ్రి రాజేందర్‌‌‌ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఓ విలేకరి‌.. శింబు-త్రిష పెళ్లి‌ గురించి స్పందించమని కోరగా.. ఆయన‌ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నను దాటవేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని