మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు - Oil Companies Hike Petrol Diesel Prices
close
Updated : 03/12/2020 11:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు

దిల్లీ: రెండు రోజుల విరామం అనంతరం చమురు సంస్థలు మరోసారి ధరలు పెంచాయి. గురువారం పెట్రోలుపై 17, డీజిల్‌పై 19 పైసలు పెరిగాయి. దాంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 82.66గా ఉండగా, డీజిల్ ధర 72.84కు చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు పీపా ధర 48.12 డాలర్లుగా ఉంది. చమురు సంస్థలు ధరలు పెంచడంతో నవంబర్ 20న పెట్రోల్, డీజిల్‌ ధరల్లో మార్పులు కనిపించాయి. అంతకు, ముందు 48 రోజులు ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. కాగా, వ్యాట్ ఆధారంగా ఆయా రాష్ట్రాల ధరల్లో తేడాలు కనిపిస్తుంటాయి.

కొవిడ్ టీకా అభివృద్ధిపై సానుకూల వార్తలు వెలువడటం, ఇప్పటికే ఫైజర్ టీకాను యూకే ప్రభుత్వం అనుమతించడం వంటి పరిణామాలతో అంతర్జాతీయంగా చమురు ధరల్లో వృద్ధి కనిపిస్తోంది. దీంతో ఆ ప్రభావం దేశీయ ఇంధన ధరలపైనా పడింది. మధ్యలో స్వల్ప విరామం వచ్చినపటికీ, నవంబర్‌ 20 నుంచి ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ఇంధన ధరల్లో రోజూవారీ మార్పులు చేస్తుంటాయి. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని