బీసీసీఐ మాట్లాడే వరకు స్పందించం: పీసీబీ  - PCB Chairman Ehsan Mani says he has no intention to talk with BCCI regarding bilateral series unless the political relations get better
close
Published : 15/09/2020 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీసీసీఐ మాట్లాడే వరకు స్పందించం: పీసీబీ 

తొలుత భారత్‌-పాక్‌ సంబంధాలు బలపడాలి

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ పునరుద్ధరణ కోసం బీసీసీఐ స్పందించే వరకు తాము చర్చలు జరపబోమని పీసీబీ ఛైర్మన్‌ ఎహ్‌సన్‌ మణి పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం తామెంతగానో కృషి చేశామని, అయితే.. భారత క్రికెట్‌ బోర్డు నుంచి సరైన స్పందన రాలేదని చెప్పాడు. తాజాగా ఐఏఎన్‌ఎస్‌ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన ఇరు దేశాల మధ్య క్రికెట్‌ వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘భారత్‌-పాకిస్థాన్‌ దేశాల మధ్య దౌత్య, రాజకీయ సంబంధాలు బలపడే వరకు మేం క్రికెట్‌ వ్యవహారాల గురించి మాట్లాడం. ఇరు జట్ల మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడానికి మేం ఎన్నో ఏళ్లుగా బీసీసీఐతో చర్చలు జరిపాం. ఇప్పుడిక భారత్‌తో టీ20 క్రికెట్‌ ఆడాలనే ఉద్దేశం మాకు లేదు. తొలుత రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు తొలగిపోవాలి. పరిస్థితులన్నీ చక్కబడాలి. అప్పుడే మేం ఏదైనా మాట్లాడతాం’ అని మణి పేర్కొన్నాడు.

‘రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం ఇకపై బీసీసీఐతో సంప్రదించను. వాళ్లేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వమూ క్రికెట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలే బీసీసీఐతో మాట్లాడుతుందని అనుకుంటున్నా. 1990ల కాలంలో రెండు బోర్డుల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అప్పుడు నేను పీసీబీ ప్రతినిధిగా ఉన్నప్పుడు.. బీసీసీఐ, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌లు అయిన జగ్‌మోహన్‌ దాల్మియా, శరద్‌ పవార్‌, మాధవరావు సింథియాలతో బాగా మాట్లాడేవాడిని. వారితో మంచి అనుబంధం నెలకొంది. కానీ గత 12 ఏళ్లుగా ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు బోర్డుల మధ్య ఉండాల్సిన రీతిలో పరిస్థితులు లేవు. బీసీసీఐ, పీసీబీ రెండూ నమ్మకం, స్వేచ్ఛగా మాట్లాడుకునేలా ఉండాలి. 2018లో నేను పీసీబీ ఛైర్మన్‌గా తిరిగి బాధ్యతలు తీసుకున్నాక ఇప్పుడున్న పరిస్థితులు చూసి నిరాశ చెందాను. అవన్నీ నన్ను షాక్‌కు గురిచేశాయి. తర్వాత రెండు జట్ల మధ్య క్రికెట్‌ బలోపేతం కోసం నేనెంతగానో ప్రయత్నించా. కానీ బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు’ అని ఆయన అన్నాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని