కోహ్లీని అంత తక్కువ అంచనా వేశావా జునైద్‌? - Pakistan pacer Junaid Khan speaks about Virat Kohli and says he thought him as normal batsman
close
Updated : 27/07/2020 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీని అంత తక్కువ అంచనా వేశావా జునైద్‌?

నేను వేసిన బంతిని ఆడకపోయేసరికి అలా అనుకున్నా..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఎక్కడైనా అవలీలగా బ్యాటింగ్‌ చేయగల సమర్థుడు. ఇప్పటికే క్రికెట్‌లోని అత్యధిక రికార్డులను తన పేరిట వేసుకుంటున్నాడు. వరుసగా మూడేళ్లు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచాడు. అంత గొప్ప ఆటగాడిని సాధారణ బ్యాట్స్‌మన్‌ అనుకున్నానని పాక్‌ పేసర్‌ జునైద్‌ ఖాన్‌ అన్నాడు. తాజాగా ‘క్రిక్‌ఇన్‌జిఫ్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడుతూ తన ఆటకు సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత 2012లో పాక్‌ భారత పర్యటన సందర్భంగా అతడు కోహ్లీని మూడుసార్లు ఔట్‌ చేసిన విషయంపై ప్రశ్నించాడు. దానికి స్పందిస్తూ జునైద్‌ ఇలా చెప్పుకొచ్చాడు.

మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియా సారథి అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని, అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పాడు. ఎవర్ని అడిగినా.. బాబర్‌ అజామ్‌, జోరూట్‌, విలియమ్సన్‌, స్టీవ్‌స్మిత్‌ లాంటి ఆటగాళ్లు ఈ తరంలో మంచి బ్యాట్స్‌మెన్‌ అంటారన్నాడు. వారందరిలో కోహ్లీ ఉత్తమ ఆటగాడని పేర్కొన్నాడు. అయితే, ఆ పర్యటన కన్నా ముందే తాను దేశవాళీ క్రికెట్‌ ఆడానని, అప్పుడు బాగా సాధన‌ చేయడంతో టీమ్‌ఇండియా పర్యటనలో రాణించానని చెప్పాడు. ఆ పర్యటన ద్వారానే తాను వన్డేలకు తిరిగొచ్చినట్లు వెల్లడించాడు. అప్పుడు మంచి ప్రదర్శన చేయడం చాలా ముఖ్యమని, భారత్‌లో వికెట్లు పడగొడితే ఆ తర్వాత కూడా అలాగే కొనసాగాలనే విషయం తనకు తెలుసని చెప్పాడు. 

ఈ నేపథ్యంలోనే తాను కోహ్లీకి తొలి బంతి వేసినప్పుడు అది వైడ్‌ బంతిగా పడిందని, తర్వాతి బంతిని కోహ్లీ ఆడకపోయేసరికి అతడు సాధారణ బ్యాట్స్‌మన్‌ అకున్నానని జునైద్‌ వ్యాఖ్యానించాడు. ఇక సిరీస్‌ కన్నా ముందు అతడు తనతో సరదాగా మాట్లాడినట్లు పాక్‌ పేసర్‌ వెల్లడించాడు. ‘ఇవి భారత పిచ్‌లు ఇక్కడ నీ ప్రభావం ఉండదు’అని చెప్పడంతో తాను కూడా దీటుగా బదులిచ్చానని చెప్పాడు. ‘చూద్దాం.. నేను కూడా మంచి ఫామ్‌లో ఉన్నా’అని కోహ్లీతో చెప్పినట్లు పేర్కొన్నాడు. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని