
తాజా వార్తలు
బ్యాడ్మింటన్ ఆడలేననుకున్నా: కశ్యప్
హైదరాబాద్: ఆస్తమా ఉందని తెలిసిన తర్వాత తాను ఇకపై బ్యాడ్మింటన్ ఆడలేననుకున్నానని క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ అన్నారు. సమంత వ్యాఖ్యాతగా ‘ఆహా’లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ చాట్ షో ‘సామ్ జామ్’. ఇటీవల ప్రారంభమైన ఈ షోలో తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా, కశ్యప్ పాల్గొని సందడి చేశారు. బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం గురించి కశ్యప్ స్పందిస్తూ కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
‘‘నేను చదువులో బాగా చురుగ్గా ఉండేవాడిని. స్కూల్ చదువు పూర్తయ్యాక బ్యాడ్మింటన్‌నే కెరీర్‌గా ఎంచుకోవాలా? లేదా ఇంజినీరింగ్ చేయాలా?అని బాగా ఆలోచించాను. ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాసి కౌన్సిలింగ్‌కు వెళ్లిన సమయంలో ఆటపైనే దృష్టి పెట్టాలనిపించింది. ‘అమ్మా.. చదువు, స్పోర్ట్స్ రెండింటిలోనూ ఒకేసారి ఫోకస్ చేయలేను. ఒక క్రీడాకారుడిగా నన్ను నేను నిరూపించుకోవడానికి సమయం ఇవ్వు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే అప్పుడు చదువుతాను’ అని అప్పుడు మా అమ్మతో చెప్పాను. నా మాట విని అమ్మ షాక్ అయ్యింది. తర్వాత ఓకే అని చెప్పింది. నాన్నకి కూడా అమ్మే నచ్చజెప్పింది. అలా బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాను. అదే సమయంలో నాకు ఆస్తమా ఉందని వైద్యులు చెప్పారు. ఇక కెరీర్ ముగిసిపోయిందని.. బ్యాడ్మింటన్ ఆడలేననుకున్నాను. కానీ, వైద్యులు చెప్పిన మందులు తీసుకుంటున్నాను. అది ఎప్పటికీ ఒక ఫైట్. ఇప్పుడు అంతా బాగానే ఉంది’’ అని కశ్యప్ తెలిపారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
