రండి.. థియేటర్‌లో సినిమా చూడండి! - Prabhas wants people to experience films on the big screen. Watch video
close
Updated : 24/12/2020 18:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రండి.. థియేటర్‌లో సినిమా చూడండి!

హైదరాబాద్: ‘బాహుబలి’తో నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు ప్రభాస్‌. తాజాగా ఆయన ప్రేక్షకులనుద్దేశించి ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వ అనుమతితో థియేటర్లు తెరుచుకోవటంతో నటీనటులు శరవేగంగా షూటింగ్‌లను పూర్తి చేసుకొని థియేటర్లలో చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

ప్రేక్షకులు థియేటర్లలో చిత్రాలు చూసేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా ప్రభాస్‌ కోరారు. థియేటర్లకు పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మంచి సినిమా చూశామనే సంతృప్తిని కలుగజేస్తామని, అన్ని జాగ్రత్తలతో సినిమాలు తిరిగి మీ ముందుకు రానున్నాయని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. 

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్‌లో నటిస్తున్నారు. దీని తర్వాత ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ‘సలార్‌’లో నటించనున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. జనవరిలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దిశాపటానీ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. దీని తర్వాత ఓం రౌత్‌ ‘ఆది పురుష్‌’తో పాటు, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని