రానా-మిహికల వివాహం: అతిథులెందరంటే! - Rana and Miheeka wedding celebrations full swing
close
Updated : 05/08/2020 10:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రానా-మిహికల వివాహం: అతిథులెందరంటే!

 

హైదరాబాద్‌: నటుడు రానా-మిహిల వివాహం ఈనెల 8న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు పెళ్లి పనులు వేగం పెంచారు. తొలుత అనుకున్న ప్రణాళిక ప్రకారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ లేదా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లో చేయాలని భావించారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేదికను మార్చారట. రోకా వేడుక నిర్వహించిన రామానాయుడు స్టూడియోస్‌లో వివాహం కూడా జరగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారు.

‘‘వివాహ వేడుకకు వచ్చే వారి సంఖ్య 30 కూడా దాటదు. చాలా కొద్దిమంది అతిథులు మాత్రమే దీనికి హాజరవుతారు. మా బంధువులు, చిత్ర పరిశ్రమలోని వారిని కూడా ఈ వివాహానికి పిలవడం లేదు. అందుకు కారణం నానాటికీ కొవిడ్‌-19 కేసులు పెరుగుతుండటమే. మా వేడుకల వల్ల ఎవరి ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టలేం. ఈ వేడుక చాలా చిన్నది కావొచ్చు.. కానీ అందమైనది’’ అని రానా తండ్రి, నిర్మాత సురేశ్‌బాబు చెప్పుకొచ్చారు.

ఇక వివాహానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేడుక ప్రాంతంలో వీలైనన్ని చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేయడంతో పాటు, భౌతికదూరం పాటించేలా చూస్తామన్నారు. అది తమకు చాలా ప్రత్యేకమైన రోజని అందుకే భద్రత విషయం అస్సలు రాజీపడమని మిహిక తల్లి బంటి బజాజ్‌ తెలిపారు.

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని