సలార్‌: ఆడిషన్‌ కాల్‌-వయసుతో సంబంధం లేదు! - Salaar Audition Call
close
Published : 09/12/2020 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సలార్‌: ఆడిషన్‌ కాల్‌-వయసుతో సంబంధం లేదు!

ప్రభాస్‌ సినిమాలో నటించాలనుకునేవాళ్లకి అవకాశం

హైదరాబాద్‌: ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రంలో నటించాలనుకుంటున్నారా? అయితే ఈ సువర్ణావకాశం మీకోసమే. ప్రభాస్‌-ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో రానున్న చిత్రం ‘సలార్‌’. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ప్రకటించారు. ఈ నెల 15న హైదరాబాద్‌, శేరిలింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగనున్న ‘సలార్‌’ ఆడిషన్‌ కోసం ఆసక్తి ఉన్నవారు వన్‌ మినిట్‌ వీడియోతో(ఏ భాష అయినా పర్వాలేదు) హాజరు కావాలని వెల్లడించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఈ ఆడిషన్స్‌ జరగనున్నాయి. త్వరలో బెంగళూరు, చెన్నైల్లోనూ ఆడిషన్స్‌ జరగనున్నాయని దర్శకుడు తెలియజేశారు.

కె.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్నారు. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రానున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే సందడి చేయనున్నారు. మరోవైపు, ‘కేజీఎఫ్‌-2’ పనుల్లో దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ బిజీగా ఉన్నారు. యశ్‌ కథానాయకుడిగా.. ‘కేజీఎఫ్‌’కు స్వీకెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈసినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది.

ఇవీ చదవండి

‘సలార్‌’ అర్థం చెప్పిన ప్రశాంత్‌ నీల్‌..!

‘కేజీఎఫ్‌-2’ టీజర్‌ డేట్‌ ఫిక్స్‌..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని