పెళ్లికి దూరంగా ఉండాలని వార్నింగ్‌..! - Solo Brathuke So Better Trailer Out Now
close
Published : 19/12/2020 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లికి దూరంగా ఉండాలని వార్నింగ్‌..!

ఆకట్టుకునేలా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘మన రాజ్యాంగం మనకి స్వేచ్ఛగా జీవించమని కొన్ని హక్కులు ఇచ్చింది. వాటిని మనం ఈ ప్రేమ, పెళ్లి అనే రిలేషన్‌షిప్స్‌తో నాశనం చేసేస్తున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నటుడు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన యూత్‌ఫుల్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. సుబ్బు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ప్రేమ, పెళ్లి అనే మాటలకు దూరంగా ఉండే సాయిధరమ్‌ తేజ్‌.. అనుకోకుండా నభానటేష్‌తో ఎలా ప్రేమలో పడతాడు? ఆ తర్వాత వీరిద్దరూ తమ జీవితాన్ని ఎలా ముందుకు సాగిస్తారు? ప్రేమపట్ల హీరోకి ద్వేషం కలగడానికి కారణమేమిటి? ఇలా విభిన్నమైన అంశాలతో యువతను ఆకర్షించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించనట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ‘ఈ సినిమా హాళ్లలో మందు, సిగరెట్‌కి దూరంగా ఉండాలని వార్నింగ్‌ ఇస్తారు కదా. అలాగే పెళ్లికి, పెళ్లానికి దూరంగా ఉండాలని వార్నింగ్‌ ఇవ్వాలి’ అని రావురమేష్‌ చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడూ భూకంపాలు వస్తుంటాయి’ అంటూ సాయిధరమ్‌ తేజ్‌ చెప్పిన డైలాగులు మెప్పించాయి.

ఇవీ చదవండి

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో

పిసినారి పెళ్లి.. లాక్‌డౌన్‌తో తిప్పలు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని