టిక్‌టాక్‌పై వెనక్కి తగ్గిన పాకిస్థాన్‌! - TikTok ban overturned in Pakistan
close
Published : 19/10/2020 21:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌పై వెనక్కి తగ్గిన పాకిస్థాన్‌!

యాప్‌ను పునరుద్దరించిన టీపీఏ

కరాచీ: టిక్‌టాక్‌ యాప్‌పై నిషేధం విధించి పది రోజులు గడవక ముందే పాకిస్థాన్‌ వెనక్కి తగ్గింది. తాజాగా దేశంలో టిక్‌టాక్‌ను పునరుద్ధరిస్తున్నట్లు పాకిస్థాన్‌ టెలికమ్యూనికేషన్‌ అథారిటీ (పీటీఏ) వెల్లడించింది. అనైతిక, అసభ్యకర సమాచారాన్ని తొలగిస్తామని టిక్‌టాక్‌ యాజమాన్యం హామీ ఇవ్వడంతోనే వీటిని మళ్లీ అనుమతిస్తున్నట్లు పేర్కొంది. స్థానిక చట్టాలకు లోబడే టిక్‌టాక్‌ కార్యకలాపాలు కొనసాగుతాయని పీటీఏ ప్రకటించింది.

అనైతిక, అసభ్యకర సమాచారంపై ఎక్కువ ఫిర్యాదులు రావడంతో అలాంటి సమాచారాన్ని తొలగించాలని పీటీఏ రెండు నెలల ముందే హెచ్చరించింది. అప్పట్లో దీనిపై టిక్‌టాక్‌ యాజమాన్యం స్పందించలేదు. దీంతో, ఈ యాప్‌ను దేశంలో నిషేధిస్తున్నట్లు పీటీఏ అక్టోబర్‌ 9న ప్రకటించింది. నిషేధం అనంతరం టిక్‌టాక్‌ యాజమాన్యం స్పందించింది. అసభ్య సమాచారాన్ని తొలగిస్తామని హామీ ఇవ్వడంతో పీటీఏ మళ్లీ టిక్‌టాక్‌ యాప్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, పాకిస్థాన్‌ తాజా నిర్ణయంతో చైనా, పాకిస్థాన్‌ స్నేహం మరోసారి బయటపడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు భారత్‌తోపాటు అమెరికాలోనూ టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని