నా కృతజ్ఞతలకు హద్దులు లేవు: అమితాబ్‌ - amithabh bhachhan expressed gratitude towards well wishers
close
Updated : 17/07/2020 19:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా కృతజ్ఞతలకు హద్దులు లేవు: అమితాబ్‌

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌.. ఆయన కుటుంబసభ్యుల్లో కొందరికి ఇటీవల కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమితాబ్‌కు కరోనా సోకిందని తెలియగానే ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. అమితాబ్‌ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అభిమానులైతే ఆయన కరోనా నుంచి కోలుకోవాలని పూజలు... యాగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై ప్రేమ చూపిస్తున్న శ్రేయోభిలాషులకు, అభిమానులకు సోషల్‌మీడియా ద్వారా అమితాబ్‌ ధన్యవాదాలు తెలిపారు. 

‘‘మేము బాగుండాలని మీరంతా కోరుకున్నారు. ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌, ఇన్‌స్టా, బ్లాగ్‌ ఇతర సోషల్‌ మీడియా ద్వారా మీ ఆశీస్సులు, ప్రేమ, ప్రార్థనలు అందించారు. మీ అందరికి నేను చెప్పే కృతజ్ఞతలకు హద్దులు లేవు. ఆస్పత్రిలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. అందుకే నా ఆరోగ్యంపై మరిన్ని వివరాలు చెప్పలేకపోతున్నా.. ప్రేమతో నమస్కారం’’ అని అమితాబ్‌ ట్వీట్‌ చేశారు. అంతకుముందు ట్వీట్‌లో ‘‘త్వమేవ మాతా చ పితా త్వమేవ. త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ. త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ. త్వమేవ సర్వం మమ దేవ దేవ’’అని ప్రార్థిస్తూ శివుడి ఫొటో పోస్టు చేశారు. అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. గత శనివారం రాత్రి కరోనా సోకిందని తెలిసిన వెంటనే ఆ విషయాన్ని అమితాబ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అప్పటి నుంచి ఆయనకు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని