తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
ఇంటర్నెట్ డెస్క్: ‘పుష్ప’ సినిమాలో తెలుగమ్మాయినే హీరోయిన్గా పెట్టాలని అల్లు అర్జున్ పట్టుబట్టాడని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. బన్ని అంతటి పెద్ద హీరో తెలుగు హీరోయిన్ కావాలని కోరడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. అయితే.. వేరే కారణాల వల్ల రష్మికను తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో వచ్చిన ‘ప్లేబ్యాక్’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సుకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించిన తెలుగు అమ్మాయి అనన్యపై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. ఇందులో అనన్య ఎంతో చక్కగా నటించిందని అన్నారు. తన సినిమాల్లో తెలుగు సరిగా రాని హీరోయిన్లను పెట్టుకుంటే వాళ్లు డైలాగులు చెప్పడానికి ఎంతో ఇబ్బందిపడేవారని ఆయన అన్నారు. అందుకే.. ఇక నుంచి తెలుగు వచ్చిన వాళ్లనే పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘రంగస్థలం’లో కూడా సమంత, ప్రకాశ్‌రాజ్ తప్పితే మిగిలిన వాళ్లంతా తెలుగు వాళ్లేనని గుర్తు చేశారు. వాళ్లిద్దరూ కూడా తెలుగు ఎంతో బాగా మాట్లాడతారన్న కారణంతోనే వాళ్లను తీసుకున్నానని చెప్పుకొచ్చారు. తన తర్వాతి సినిమాలో కచ్చితంగా తెలుగమ్మాయినే హీరోయిన్గా పెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- రామ్.. దేవిశ్రీ ఏడోసారి
-
‘విక్రాంత్ రోణ’ విడుదల తేదీ ఖరారైంది
-
‘విరాట పర్వం’ విడుదల వాయిదా
- దృశ్యం-2: వెంకీమామ పూర్తి చేశాడు
-
ఇష్క్.. ఇది ప్రేమకథ కాదు
గుసగుసలు
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
- తదుపరి చిత్రం ఎవరితో?
-
కొరటాల చిత్రంలో కొత్తగా కనిపించనున్న ఎన్టీఆర్!
- వెంకటేష్, వరుణ్‌తేజ్ చిత్రంలో అంజలి!
- ఎన్టీఆర్ సరసన కియారా?
రివ్యూ
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
కొత్త పాట గురూ
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం