‘కోబ్రా’.. మరో రూపం - cinema
close
Updated : 13/06/2021 05:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కోబ్రా’.. మరో రూపం

ప్రతి సినిమాలోనూ ఓ కొత్త గెటప్పుతో కనిపించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు కథానాయకుడు విక్రమ్‌. ఇందుకోసం ఆయన ఎంతటి సాహసానికైనా వెనకాడరు. ప్రస్తుతం ఆయన అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో ‘కోబ్రా’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్రమ్‌ 20కి పైగా విభిన్నమైన గెటప్పుల్లో సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో ఆయన పాత్రకు సంబంధించిన కొన్ని రూపాలను చూపించారు. తాజాగా దర్శకుడు జ్ఞానముత్తు మరో కొత్తలుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో విక్రమ్‌ నల్లని గడ్డంతో.. సగం వరకు వేసిన ప్రోస్థటిక్‌ మేకప్‌తో గుర్తుపట్టలేని విధంగా కనిపించారు. ‘‘మళ్లీ సాధారణ జీవితాలు గడపడానికి చాలా దగ్గరలో ఉన్నాం. తిరిగి పనిలో చేరేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని అజయ్‌ ఆ ఫొటోకి ఓ వ్యాఖ్యని జత చేశారు. ప్రస్తుతం తమిళనాడులో కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో.. చిత్రీకరణ పునఃప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని