తెలంగాణలో కొత్తగా 518 కరోనా కేసులు - corona cases up date in telangana
close
Updated : 26/03/2021 10:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కొత్తగా 518 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 57,548 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 518 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ముగ్గురు మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1683కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 204 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,995 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 1,767 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 157 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత ఎనిమిది రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. గత వారం రోజుల వ్యవధిలో నాలుగింతలకు పైగా పాజిటివ్‌లు నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో గత ఏడాది నవంబరు నెలాఖరులో 502 కేసులు నమోదవగా.. మళ్లీ అదే స్థాయిలో శుక్రవారం 518 కొత్త కేసులు నమోదవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఏడాది కిందట నమోదైన కేసులతో పోల్చితే.. ప్రస్తుతం వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యశాఖ చెబుతోంది. గతేడాది వైరస్‌లో మార్పులు చెంది కొత్తగా రూపాంతరం చెందిందా? లేదా బ్రిటన్‌, దక్షిణాఫ్రికా రకం వైరస్‌లా? అనేది ప్రస్తుతం నిర్ధారణ కాకపోయినా.. అతి వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందన్నది మాత్రం వాస్తవమని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితుల చేరికలు పెరుగుతున్నాయి. గత వారంరోజుల్లో దాదాపు 70 శాతం పెరగడం తీవ్రతకు అద్దం పడుతోంది.  ప్రస్తుతం కొవిడ్‌ చికిత్సలపై స్పష్టత ఏర్పడడంతో.. బాధితులను త్వరగా గుర్తించి స్థానికంగానే నయం చేయడానికి అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇతరత్రా అనారోగ్యంతో బాధపడుతున్నవారిని, కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్నవారిని, కచ్చితంగా సూపర్‌ స్పెషాలిటీ సేవలు అవసరమైన వారిని మాత్రమే గాంధీ, ఉస్మానియా తదితర బోధనాసుపత్రులకు తరలించాలని సూచించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని