మూడు ఫంగస్‌లతో పాజిటివ్‌ వ్యక్తి మృతి - covid patient with 3 fungus diseases died in up
close
Updated : 29/05/2021 18:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడు ఫంగస్‌లతో పాజిటివ్‌ వ్యక్తి మృతి

లఖ్‌నవూ: కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి మూడు ఫంగస్‌లు సోకి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది.  స్థానిక సంజయ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల కున్వర్‌ సింగ్‌ అనే లాయర్‌ కరోనా బారిన పడటంతో చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రిలో చేరారు. మే 24న ఆయనకు ఎండోస్కోపీ చేయగా.. బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌తో పాటు ఎల్లో ఫంగస్‌ను కూడా గుర్తించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శరీరంలోని రక్తం విషపూరితంగా మారడంతో చికిత్స పొందుతూ నిన్న రాత్రి కున్వార్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. 

కాగా.. ఇదే ఆసుపత్రిలో మురాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మరో 59 ఏళ్ల  వ్యక్తి రాజేశ్‌ కుమార్‌కు ఎల్లో ఫంగస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అతడి మెదడు సమీపంలో ఈ ఫంగస్‌ ఉందని, ఇప్పటికే ఆయన దవడలో సగభాగం తీసేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రాజేశ్ కుమార్‌ కోలుకుంటున్నట్లు చెప్పారు.

ఇటీవల కరోనా బాధితుల్లో ఫంగస్‌ లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా 12వేల పైచిలుకు బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదవ్వగా.. అక్కడక్కడా వైట్‌ ఫంగస్‌, ఎల్లో ఫంగస్‌ కేసులు కూడా వెలుగుచూస్తున్నాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని