ఆ ప్రొటీన్‌ లోపం వల్లే.. ఐరోపాలో కరోనా ఉద్ధృతం! - due to that protein deficiency corona excerpt in europe
close
Published : 10/02/2021 11:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ప్రొటీన్‌ లోపం వల్లే.. ఐరోపాలో కరోనా ఉద్ధృతం!

దిల్లీ: ఊపిరితిత్తులకు రక్షణ కల్పించే ప్రొటీన్‌ లోపం కారణంగానే... ఐరోపా, ఉత్తర అమెరికా ప్రజలు ఎక్కువగా కరోనా బారిన పడ్డారని తాజా పరిశోధన విశ్లేషించింది. ఈ విషయంలో ఆసియా ప్రజలే మేలని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జీనోమిక్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. ఉత్తర అమెరికా, ఐరోపా ప్రాంతంలో అత్యధిక మందికి సోకిన ‘డీ614జీ’ ఉత్పరివర్తన రకం కరోనా వైరస్‌పై వారు అధ్యయనం సాగించారు. ‘‘ఉత్తర అమెరికా, ఐరోపా ప్రజల్లో శ్వాసవ్యవస్థను పరిరక్షించే ఆల్ఫా-యాంటీ-ట్రిప్సిన్‌ (ఏఏటీ) ప్రొటీన్‌ స్థాయిలు తక్కువగా ఉన్నట్టు గుర్తించాం. ఇది లోపించినవారి శరీరాల్లోకి ‘డీ614జీ’ రకం కరోనా వైరస్‌ త్వరగా చొచ్చుకెళ్లింది. స్పెయిన్, ఇటలీల్లో ఈ వైరస్‌ విజృంభించడానికి అక్కడి ప్రజల్లో ఏఏటీ లోపమే కారణమని భావిస్తున్నాం’’ అని పరిశోధనకర్త నిదాన్‌ బిశ్వాస్‌ వివరించారు.

ఇవీ చదవండి..

20 రోజుల క్రితం టీకా.. తాజాగా కరోనామరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని