close
Published : 03/03/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇది మసాలా సినిమా కాదు

‘‘భార్యాభర్తల మధ్య బంధం నేపథ్యంలో సాగే కథే ఈ చిత్రం. సమాజంలో   జరుగుతున్న విషయాల్ని ప్రతిబింబించేలా ఉంటుంది’’ అన్నారు పూర్ణ. ఆమె కథా నాయికగా నటించిన చిత్రం ‘బ్యాక్‌డోర్‌’. తేజ కథానాయకుడు. కర్రి బాలాజీ   దర్శకత్వం వహిస్తున్నారు. బి.శ్రీనివాస్‌రెడ్డి నిర్మాత. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పూర్ణ  మాట్లాడుతూ ‘‘పేరు చూసి ఇది  మసాలా సినిమా అనుకోవద్దు. ఇదొక మంచి సినిమా. అందుకే ఈ చిత్రంలో  నటించా. నేను మసాలా సినిమాలు చేయను. నా కుటుంబంపైన, నా నటనపైన నాకెంతో గౌరవం ఉంది. ఈ సినిమా అందరూ చూసేలా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కె.ఎస్‌.రామారావు, కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌, రాజ్‌ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కోన వెంకట్‌, కె.అశోక్‌కుమార్‌, వీరశంకర్‌, తిరుపతిరెడ్డితోపాటు తిరుమలేష్‌ నాయుడు, సతీష్‌రెడ్డి, విక్రమ్‌ రమేష్‌, విజయ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని