శర్వా కొత్త కబురు?
close
Published : 22/09/2021 04:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శర్వా కొత్త కబురు?

శర్వానంద్‌ మరో కొత్త సినిమాకి పచ్చజెండా ఊపారా? దసరాకి ఆ కొత్త కబురు వినిపించనున్నారా? అవుననే అంటున్నాయి చిత్రసీమ వర్గాలు. శర్వా ప్రస్తుతం ‘మహా సముద్రం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, ‘ఒకే ఒక జీవితం’ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ‘మహా సముద్రం’ ఈ దసరా సందర్భంగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడీ పండగ సందర్భంగానే శర్వా ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాజు సుందరం దర్శకుడిగా వ్యవహరించనున్నట్లు సమాచారం. వక్కంతం వంశీ కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ కోసం పలువురు నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. దసరాకి చిత్రాన్ని ప్రకటించి.. ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని