Sri Simha: శ్రీసింహా చిత్రం ప్రారంభం - telugu news Hero sri simha New movie pooja Ceremony
close
Updated : 26/10/2021 07:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sri Simha: శ్రీసింహా చిత్రం ప్రారంభం

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భాగ్‌ సాలే’. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌ రంగినేని, శింగనమల కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. డి.సురేష్‌బాబు సమర్పకులు. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్‌శంకర్‌ క్లాప్‌నిచ్చారు. నిర్మాత సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ‘‘కథానాయకుడు శ్రీసింహా ‘మత్తు వదలరా’, ‘తెల్లవారితే గురువారం’ తర్వాత చేస్తున్న చిత్రమిది. క్రైమ్‌ కామెడీ కథతో రూపొందుతోంది. కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. కొత్త రకమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని