తారక్‌-చరణ్‌.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌!
close
Published : 14/04/2020 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తారక్‌-చరణ్‌.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌!

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి భారీగా రూపొందిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా విడుదల తేదీలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే షూటింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు జరిగినప్పటికీ.. ముందుగా అనుకున్నట్లే వచ్చే ఏడాది జనవరి 8న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్‌ సమయంలోనే వీలైనంత వరకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అంతా ఇంట్లోనే ఉంటూ సినిమా పనులు చేస్తున్నట్లు టాక్‌. ఇందులో భాగంగానే కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఇంటి నుంచే డబ్బింగ్‌ పనుల్ని మొదలుపెట్టారట.

సాధారణంగా డబ్బింగ్‌ చెప్పడానికి సౌండ్‌ ప్రూఫ్‌ రూమ్‌లు, క్వాలిటీ ఉన్న సౌండ్‌ రికార్డింగ్‌ మైక్‌ కావాలి. ఇందు కోసం రాజమౌళి.. తారక్‌, చరణ్‌ ఇంటికి రెండు క్వాలిటీ మైక్‌లు పంపినట్లు సమాచారం. వారి వారి ఇంటిలో సౌండ్‌ ఫ్రూఫ్‌ గోడలు ఉండే మినీ థియేటర్‌లో డబ్బింగ్‌ చెబుతున్నట్లు తెలిసింది. మరి ఈ సమాచారంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కు సంబంధించి దాదాపు చిత్రీకరణ పూర్తయింది. కథానాయిక అలియా భట్‌ షెడ్యూల్‌ ప్రారంభం కావాల్సి ఉంది. నటి ఒలీవియా మోరిస్‌ ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొన్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ కనిపించనున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని