రాజమౌళిపై రెండు కేసులు పెట్టారట!
close
Published : 23/02/2020 20:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజమౌళిపై రెండు కేసులు పెట్టారట!

‘హిట్‌’ మూవీ ప్రీరిలీజ్‌ వేడుకలో సుమ, రాజమౌళి మధ్య ఆసక్తికర చర్చ

హైదరాబాద్‌: విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘HIT‌’.  రుహాని శర్మ కథానాయిక. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై నాని ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా, ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నటి అనుష్క, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, రానా తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత సుమ, దర్శకుడు రాజమౌళి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. 

సుమ: ముగ్గురు కో-డైరెక్టర్‌లు.. ఇద్దరు అసిస్టెంట్‌ డైరెక్టర్ల భార్యలు మీ కేసులు నమోదు చేశారు? సినిమా ఎప్పుడు అవుతుందోనని అడుగుతున్నారు.

రాజమౌళి: కేవలం కో-డైరెక్టర్ల భార్యలే ఫిర్యాదు చేశారా? హీరోల ఫ్యాన్స్‌ చేయలేదా? 

సుమ: చేశారు సర్‌.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ఫ్యాన్స్‌ నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. మా హీరోలను మీ దగ్గర పెట్టుకున్నారు. ఎప్పుడు రిలీజ్‌ చేస్తారని అంటున్నారు.  డేట్‌ పక్కాగా చెబితే కేసు క్లోజ్‌ చేసేద్దాం

రాజమౌళి: ఇప్పటికే చెప్పాం కదా!

సుమ: మే 2021న విడుదల చేస్తారా?

రాజమౌళి: సంక్రాంతికి రాబోతున్నారు. 2021 జనవరి 8వ తేదీన విడుదల చేస్తాం. 

సుమ: ప్రతి సినిమా ఎలా హిట్‌ చేస్తున్నారని వేరే వాళ్లు కేసులు పెట్టారు. దీనికి ఫార్ములా ఏదైనా ఉందా? అని అడుగుతున్నారు. 

రాజమౌళి: మీరు ఇలాంటి కేసులన్నీ తీసుకోకూడదు. ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయకూడదు. బైలాస్‌ ఉండదు. 

సుమ: మాకు బైలాస్‌ ఎక్కడుంది సర్‌.. అన్నీ బైపాస్‌లాస్‌లే.. ఏ లాస్‌ అయినా బైపాస్‌ చేసుకుని వెళ్లిపోతాం. అంటూ ఇద్దరి మధ్య చిన్న ఆసక్తికర చర్చ నడిచింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన వారందరికీ నవ్వులు పంచారు.

అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. ‘సినిమా టీజర్‌, ట్రైలర్‌ అన్నీ బాగా ఉన్నాయి. స్నీక్‌పీక్‌ అన్న ఆలోచన బాగా నచ్చింది. సినిమాలో అతి కీలకమైన సన్నివేశాన్ని ముందే విడుదల చేయడాన్ని స్నీక్‌పీక్‌ అంటారు. ఇలాంటిది 2012 ఇంగ్లిష్‌ సినిమాలో చేశారు. తొలిసారిగా ‘హిట్‌’తో తెలుగులో ఆ ధైర్యం చేశారు. విశ్వక్‌సేన్‌, నానికి ఈ సినిమా మంచి హిట్‌ వచ్చినట్టే’ అని అన్నారు. దర్శకుడు శైలేశ్‌కు మంచి పేరు తెచ్చిపెడుతుందని అనుకుంటున్నా’ అని అన్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. నాని నిర్మాతగా మారాడు. ‘అ’ మొదలుపెట్టి నేర్చుకున్నాడు. ఇప్పుడు తన రెండో సినిమాకే ‘హిట్‌’ అనే పేరు పెట్టాడు. ఎందుకంటే నానిలో అంత ఆత్మవిశ్వాసం పెరిగింది. విశ్వక్‌సేన్‌కు సినిమా బృందానికి ఈ చిత్రం మంచి విజయంగా నిలుస్తుందని కోరుకుంటున్నా’ అని అన్నారు. చిత్ర బృందానికి అనుష్క ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు. 





మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని