సుశాంత్‌కి షాకిచ్చిన అల్లు అర్జున్‌
close
Published : 16/03/2020 17:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌కి షాకిచ్చిన అల్లు అర్జున్‌

‘అర్జున్‌రెడ్డి పార్ట్‌2’ చూశారా..!

హైదరాబాద్‌: స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌.. సుశాంత్‌కి షాక్‌ ఇచ్చారు. ఇటీవల వీరిద్దరూ కలిసి కీలకపాత్రలు పోషించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టి బన్నీ కెరీర్‌లోనే ఓ సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మొదటి డిలీట్‌ సీన్‌ను చిత్రబృందం సోమవారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ వీడియోలో సుశాంత్, బన్నీ తమ అలవాట్ల గురించి మాట్లాడుకుంటూ కనిపించారు. తనకి ఇటీవల షార్ట్‌ ఫిల్మ్స్‌ షూట్‌ చేయడం అలవాటయ్యిందని.. దానివల్ల చాలా ప్రశాంతంగా ఉంటుందని బన్నీ చెబుతాడు. అనంతరం నిన్నే ఒక షార్ట్‌ఫిల్మ్‌ తీశానని.. దానికి ‘అర్జున్‌రెడ్డి పార్ట్‌2’ అని టైటిల్‌ పెట్టానని చెప్పి.. ఓ వీడియోను సుశాంత్‌కి చూపిస్తాడు. ఆ వీడియో చూసిన సుశాంత్‌ షాక్‌కు గురి అవుతాడు.

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్‌ చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జంటగా పూజాహెగ్డే నటించారు. టబు, మురళీశర్మ, రాజేంద్రప్రసాద్‌, నవదీప్‌ కీలకపాత్రలు పోషించారు. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరించారు. తమన్‌ స్వరాలు అందించారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని