44ఏళ్ల సూర్య.. 19ఏళ్ల వ్యక్తిగా ఎలా మారాడంటే?
close
Updated : 16/04/2020 14:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

44ఏళ్ల సూర్య.. 19ఏళ్ల వ్యక్తిగా ఎలా మారాడంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: పాత్ర కోసం ప్రాణం పెట్టే అతి కొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. తమిళంతో పాటు, తెలుగులోనూ ఆయన సినిమాలకు ప్రేక్షకాదరణ ఉంది. సుధా కొంగర దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘సూరారైపోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఎయిర్‌డెక్కన్‌ వ్యవస్థాపకుడు ఆర్‌.గోపీనాథ్‌ జీవితకథను సినిమా తెరకెక్కిస్తున్నారు. 

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మేకింగ్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. 44ఏళ్ల వయసున్న సూర్య యంగ్‌గా 19ఏళ్ల వ్యక్తిగా కనిపించడానికి ఎలా మారాడన్న వీడియోను షేర్‌ చేసింది. దర్శకురాలు సుధా కొంగరా చెప్పిన పాత్ర కోసం సూర్య ఎలాంటి కసరత్తులు చేశారు. ఎలాంటి డైట్‌ పాటించారన్న విషయాలను అందులో చూపించారు.

రెండు దశాబ్దాల క్రితం సూర్య ఎలా ఉన్నాడో చూపించడం తమకు ఓ సవాల్‌గా మారిందని అతని ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ చెప్పుకొచ్చారు. రోజూ ఉదయం చేసే వ్యాయామంతో పాటు, షూటింగ్‌లో ఖాళీ దొరికినప్పుడల్లా సూర్య కసరత్తులు చేస్తూనే కనిపించారు. అంతేకాదు, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసే వ్యక్తిగా కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఒక పాత్ర కోసం సూర్య ఎలా కష్టపడతారో ఈ ఒక్క వీడియో చాలు.

అపర్ణా బాల మురళి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, జాకీ ష్రాఫ్‌, పరేశ్‌రావల్‌, సంపత్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాశ్‌కుమార్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ వేసవిలో విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆగస్టులో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. 

 

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని