హోలీ.. అభిమానులకు ఎన్టీఆర్‌ గిఫ్ట్‌
close
Published : 10/03/2020 11:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హోలీ.. అభిమానులకు ఎన్టీఆర్‌ గిఫ్ట్‌

హైదరాబాద్‌: రంగుల పండగ హోలీ సందర్భంగా ‘యంగ్‌ టైగర్‌’ ఎన్టీఆర్‌ తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన హోలీ పండగ జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సతీమణి ప్రణతితో పాటు ఇద్దరు కుమారులు అభయ్‌రామ్‌, భార్గవ్‌రామ్‌లతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ అవుతోంది. చాలా రోజుల తర్వాత తమ అభిమాన కథానాయకుడు తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేయడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. తన ఇద్దరు కుమారులతో కలిసి దిగిన ఫొటో కావడం, అదీ రంగుల పండగ హోలీనాడు పంచుకోవడంతో అభిమానుల ఆనందం రెట్టింపవుతోంది. 

ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. ఇందులో ఆయన కొమరం భీం పాత్రలో దర్శనమివ్వనున్నారు. మరో కథానాయకుడు రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. చెర్రీ సరసన ఆలియా భట్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జోడీగా ఓలివియా మోరిస్‌ కనిపించనుంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెలలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. బహుశా రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన లుక్‌ లేదా, టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని