విశాఖ అభివృద్ధిపై సీఎం జగన్‌ కీలక సమీక్ష
close
Updated : 07/01/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశాఖ అభివృద్ధిపై సీఎం జగన్‌ కీలక సమీక్ష

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని సీఎం జగన్‌ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పురపాలక శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోందనే వార్తల నేపథ్యంలో అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో జగన్‌ చర్చించారు. మెట్రోరైలు, భూగర్భ పైపులైన్ల ద్వారా తాగు నీరు అందించే ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. విశాఖతో పాటు కాకినాడ, తిరుపతిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైనా అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. విశాఖకు నిరంతరాయంగా తాగునీరు అందించేలా ఆ మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. పోలవరం నుంచి నేరుగా భూగర్భ పైపులైన్‌ ద్వారా తాగునీటి సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. 

విశాఖలో ఆర్కేబీచ్‌ నుంచి భీమిలి వరకూ ట్రామ్‌ తరహా ప్రజారవాణా వ్యవస్థపై ఆలోచనలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీటిపై డీపీఆర్‌ తయారీకి త్వరలో కన్సల్టెన్సీ నియామించాలని నిర్దేశించారు. పట్టణ గృహ నిర్మాణంపై సమీక్షించిన సీఎం.. విశాఖలో సుమారు లక్షా యాభైవేల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. ఇప్పటివరకూ 48,608 హౌసింగ్‌ యూనిట్లకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించామని అధికారులు తెలిపారు. వీటి కాంట్రాక్టు విలువ రూ.2,399 కోట్లుగా ఉందని.. రివర్స్‌ టెండర్‌ ద్వారా రూ.303 కోట్లు మిగిలాయని సీఎంకు వివరించారు. మిగిలిన యూనిట్లకూ త్వరలోనే రివర్స్‌ టెండరింగ్‌ పూర్తిచేస్తామని  అధికారులు తెలిపారు. స్పెసిఫికేషన్స్‌ మార్చకుండా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని సీఎం సూచించారు. పట్టణ గృహనిర్మాణంలో డ్రైనేజీపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని