స్వేచ్ఛగా ఎదగనివ్వాలి...
close
Published : 25/03/2021 00:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వేచ్ఛగా ఎదగనివ్వాలి...

తమ కలల పంటైన పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అలాంటివారిలో మీరూ ఉన్నారా... అయితే ఒక్కసారి ఈ విషయాలను గమనించండి.

కొంతమంది తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఇలాచేస్తేనే చిన్నారులు సరైన దారిలో వెళతారని గట్టిగా నమ్ముతారు. చదువుకు తప్ప మిగతా విషయాలకు ఎలాంటి ప్రాధాన్యమివ్వరు. గంటల తరబడి పిల్లలు చదువుతూనే కూర్చోవాలంటారు. దీనివల్ల పిల్లల్లో సృజన కొరవడుతుంది. ఎదురుగా కనిపించే విషయాన్ని బట్టీ పట్టి దాన్ని అదే విధంగా రాయడమే నేర్చుకుంటారు. దీంతో ఒకలాంటి స్తబ్ధత వాళ్లను ఆవరిస్తుంది.
కొందరు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ పిల్లలు ఎదగాలని కోరుకుంటారు. ఇలా చేయడం వల్ల చిన్నారుల్లో సృజన రెక్కలు తొడుగుతుంది. చదువే లోకంలా కాకుండా ఆటపాటల్లోనూ ఎంతో చురుగ్గా ఉండగలుగుతారు. ఆటల్లో గెలుపోటములను రుచి చూడటం వల్ల ఓటమిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే నలుగురితో కలిసిమెలిసి మెలగడమూ అలవాటమవుతుంది.
పిల్లల్ని ఎలా పెంచినా... భావోద్వేగాల పరంగా వాళ్లకు దగ్గర కావడం ఎంతో అవసరం. చిన్నారులకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే అమ్మానాన్నలతో చెప్పుకునే చనువు వాళ్ల కుండాలి. అప్పుడే వాళ్లు స్వేచ్ఛగా చక్కగా ఎదుగుతారు. మానసికంగానూ వికసిస్తారు. తమ వెనుక అమ్మానాన్నలున్నారనే ధైర్యం వాళ్లలో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని