Corona: మళ్లీ 3 వేలు దాటిన కొవిడ్‌ మరణాలు
close
Updated : 03/06/2021 07:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: మళ్లీ 3 వేలు దాటిన కొవిడ్‌ మరణాలు

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా కేసులు, మరణాలు బుధవారం కొంతమేర పెరిగాయి. క్రితం రోజు కంటే కొత్త కేసులు 4.13%, మరణాలు 14.7% మేర పెరిగాయి. రోజువారీ మరణాల సంఖ్య మళ్లీ 3 వేలు దాటింది. రికవరీ రేటు పెరిగి.. పాజిటివిటీ రేటు తగ్గడం మాత్రం కొంత ఊరట. గత 24 గంటల్లో 1,32,788 కొత్త కేసులు బయటపడగా 3,207 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. వరుసగా 6వ రోజు కేసులు 2 లక్షల లోపునకు పరిమితమయ్యాయి. వరుసగా 20వ రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువ నమోదైంది. దీంతో రికవరీ రేటు 92.48%కి పెరిగింది.
* దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2.83 కోట్లు దాటింది. ఇంతవరకు 3,35,102 మంది మహమ్మారికి బలైపోయారు. దాదాపు 2.62 కోట్ల మంది కొవిడ్‌ను జయించారు.
* క్రియాశీలక కేసుల సంఖ్య మరింత తగ్గి 17,93,645 (6.34%)కి చేరింది.ఒక్క రోజులో 1,01,875 క్రియాశీలక కేసులు తగ్గాయి.

పాజిటివిటీ రేటు తగ్గుముఖం..
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 6.57%కి తగ్గింది. వరుసగా 9వ రోజు 10% లోపు నమోదైంది. మే 8 నాటికి 22.59% ఉన్న వారపు పాజిటివిటీ రేటు ఇప్పుడు తొలిసారి 8.21%కి తగ్గింది. మహారాష్ట్రలో మళ్లీ రోజువారీ మరణాలు పెరగడంతో దేశవ్యాప్త మరణాల సంఖ్య కూడా పెరిగింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని