ఘంటసాలకు ఇదొక అలవాటు - ghantasala venkateswara rao habit during songs recording
close
Updated : 08/07/2021 22:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఘంటసాలకు ఇదొక అలవాటు

ఇంటర్నెట్‌డెస్క్‌: తన సుమధుర గానంతో ప్రేక్షకులను రంజింప చేసిన అలనాటి గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆయన పాటల రికార్డింగ్‌కు వెళ్తే, చేతిలో కర్చీఫ్‌ ఉండాలట. పొరబాటున మరచిపోతే ‘కర్చీఫ్‌ లేకుండా ఎలా పాడటం?’ అనేవారట. అలాగే పాడేటప్పుడు కుడి చెవిని కుడి చేత్తో మూసుకోవడం ఆయన అలవాటు. అలా అయితేనే తన పాట తనకు స్పష్టంగా వినిపిస్తుందని ఆయన అభిప్రాయం. ఒకసారి ఏదో సమస్య వచ్చి తన పాట తనచెవికి వినిపించనట్లు అనిపించి ఘంటసాల వైద్యపరీక్షకు వెళ్లారట. పరీక్షించిన వైద్యుడు ‘అదేమంత ఇబ్బంది కాదు సర్దుకుంటుంది. పాడేందుకు గొంతు అవసరం. మీ గొంతు బాగానే ఉందిగా?’ అన్నారట. అందుకు ఘంటసాల అంగీకరించలేదట. తన చెవికి తన పాట వినిపించే దాకా పదిరోజుపాటు రికార్డింగ్‌లకు వెళ్లలేదట. వైద్యుడు చెప్పినట్లుగానే చెవి సమస్య దానంతట అదే సర్దుకొందట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని