అఖిల్‌ కోసమే ఓకే చేశా: నటి మోనల్‌ - i didnt think twice and signed the project just for akhil says monal
close
Updated : 17/02/2021 10:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అఖిల్‌ కోసమే ఓకే చేశా: నటి మోనల్‌

హైదరాబాద్‌: ప్రముఖ రియాల్టీ షోలో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన జంట అఖిల్‌‌, మోనల్‌ గజ్జర్‌. షోలో భాగంగా ఈ జంట‌ మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ అనుకున్నారు. రియాల్టీషో అనంతరం మోనల్‌ నటిగానే కాకుండా స్పెషల్‌ సాంగ్స్‌కు సైతం ఓకే చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె ఓ ప్రాజెక్ట్‌ కోసం అఖిల్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ‘తెలుగు అబ్బాయి.. గుజరాత్‌ అమ్మాయి’ పేరుతో భాస్కర్‌ బంటుపల్లి దర్శకత్వం వహిస్తున్న వెబ్‌సిరీస్‌లో వీరిద్దరూ జంటగా సందడి చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌ మోషన్‌ పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ ప్రాజెక్ట్‌ ఒప్పుకోవడానికి గల కారణాన్ని తాజాగా మోనల్‌ వెల్లడించారు. ‘ఈ సిరీస్‌ గురించి కొన్ని రోజుల క్రితమే నన్ను దర్శక, నిర్మాతలు సంప్రదించింది. ఇందులో నాకు జంటగా, హీరో పాత్రలో అఖిల్‌ నటిస్తున్నారని చెప్పగానే.. వేరే విషయాల గురించి నేను ఆలోచించలేదు. వెంటనే సంతకం చేసేశాను’ అని మోనల్‌ వివరించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని