ఏ ఆటగాడికి అలాంటి పరిస్థితి రాకూడదు:పఠాన్‌ - irfan pathan wants resolution to deepak hooda krunal pandya dispute
close
Updated : 13/01/2021 14:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏ ఆటగాడికి అలాంటి పరిస్థితి రాకూడదు:పఠాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవాళీ క్రికెట్‌లో నెలకొన్న ‘కృనాల్ పాండ్య×దీపక్‌ హుడా’ వివాదంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందించాడు. ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా జట్టు తరఫున ఆడుతున్న కృనాల్, దీపక్‌ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌ కృనాల్‌ తనని అసభ్యపదజాలంతో దూషించాడని హుడా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. 46 ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్‌లు, ఐపీఎల్‌ ఆడిన అనుభవం ఉన్న హుడా బరోడా క్యాంప్‌ నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బరోడా మాజీ కెప్టెన్‌ ఇర్ఫాన్‌ ట్వీట్ చేశాడు.

‘‘బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లు ఆటపై దృష్టిసారించాలంటే మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఇలాంటి సంఘటనలు ఆటగాడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. బరోడా క్రికెట్‌ అసోషియేషన్‌ (బీసీఏ) సభ్యులు దీనిపై దృష్టిసారించి సత్వరమే పరిష్కరించాలి. ఆటకు ఆటంకం కలిగించే ఇలాంటి చర్యలను ఖండించాలి. ఆటగాళ్లు సురక్షితంగా, స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని సృష్టించాలి. అప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని బరోడా మాజీ కెప్టెన్‌గా భావిస్తున్నా. దీపక్‌ హుడాకు జరిగింది నిజమైతే అది ఎంతో దిగ్భ్రాంతికి, నిరాశకు గురిచేసే సంఘటనే. ఎలాంటి ఆటగాడికి ఆ పరిస్థితులు ఎదురవ్వకూడదు’’ అని పఠాన్‌ తెలిపాడు.

అయితే ఈ వివాదంపై బీసీఏ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా, సయ్యద్ ముస్తాక్‌ అలీ టోర్నీని బీసీసీఐ బయోబబుల్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో సత్తాచాటిన వారికి ఐపీఎల్‌ వేలంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.

ఇదీ చదవండి

ముగ్గురు మొనగాళ్లు.. మీ విలువకు సరిలేరు

ఇది సిగ్గుచేటు: వివాదంపై స్పందించిన స్మిత్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని