అలా నటించడం అంత సులభం కాదు! - it was not easy to play george kutty mohanlal
close
Updated : 16/03/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలా నటించడం అంత సులభం కాదు!

ఇంటర్నెట్‌ డెస్క్: ఎలాంటి భావోద్వేగాలు కనిపించకుండా నటించడం చాలా కష్టమని స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ అన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘దృశ్యం2’. జీతూ జోసెఫ్‌ దర్శకుడు. ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాను పోషించిన జార్జ్‌కుట్టి పాత్ర గురించి మోహన్‌లాల్‌ తాజాగా స్పందించారు.

‘‘చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో ఎలాంటి భావోద్వేగాలు కనిపించకుండా చేయాలి. ఇలా చేయడం అంటే కొంచెం కష్టమైన పనే. అయితే మనం ఏదో చేస్తున్నట్లు మాత్రం కనిపించాలి. నటన అనేది ఒక నమ్మకం. కొన్నిసార్లు లోలోపల నిజమైన భావోద్వేగాన్ని పలికించాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఎమోషన్స్‌ చూపించాల్సి ఉంటుంది. ఇలా చేయడం చాలా కష్టం’’ అని చెప్పుకొచ్చారు.

2013లో వచ్చిన ‘దృశ్యం’ ప్రేక్షకులను ఆకట్టుకుని కాసుల వర్షం కురిపించింది. ఆ చిత్రానికి కొనసాగింపే ‘దృశ్యం2’. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని