మహారాష్ట్రలో కరోనా కొత్త రికార్డు!  - maharashtra reports 15817 new coronavirus
close
Published : 12/03/2021 22:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో కరోనా కొత్త రికార్డు! 

ముంబయి: మహరాష్ట్రలో కరోనా కొమ్ములు విసురుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరగడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా వ్యాప్తి ఆగడంలేదు. ఈ ఏడాదిలో ఎన్నడూ నమోదుకాని స్థాయిలో కొత్త కేసులు రావడం కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లోనే 15,817 పాజిటివ్‌ కేసులు, 56 మరణాలు నమోదయ్యాయి. కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో మూడు నెలల తర్వాత ఫిబ్రవరిలో తొలిసారి 6 వేల కేసులు నమోదు కాగా.. కొద్ది రోజుల్లోనే ఆ సంఖ్య 16వేల మార్కుకు చేరువ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఒక్క ముంబయి నగరంలో 1,646 కొత్త కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక క్రియాశీల కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మరోవైపు ఈ రోజు 11,344 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో కరోనా పరిస్థితిని పరిశీలిస్తే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,73,10,586 శాంపిల్స్‌ పరీక్షించగా.. 22,82,191 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  వీరిలో ఇప్పటివరకు 21,17,744 మంది కోలుకోగా.. 52,723 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,10,485 క్రియాశీల కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో రికవరీ రేటు 92.79% కాగా.. మరణాల రేటు 2.31%గా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

అత్యధిక యాక్టివ్‌ కేసులు ఇక్కడే..  

ముంబయిలో 11,083, ఠానే 11,422, పుణె 21,788, ఔరంగాబాద్‌ 5569, నాగ్‌పూర్‌ 15,011, నాసిక్‌ 5272, అమరావతి 4206, అకోలా 3846, జలగావ్‌ 4802 చొప్పున క్రియాశీల కేసులు ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని