ఆకట్టుకుంటున్న నయనతార ‘నెట్రికన్‌’ లిరికల్‌ సాంగ్‌ - netrikann idhuvum kadandhu pogum lyric nayanthara
close
Published : 09/06/2021 19:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆకట్టుకుంటున్న నయనతార ‘నెట్రికన్‌’ లిరికల్‌ సాంగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్: నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ హర్రర్‌ థ్రిల్లర్‌ నెట్రికన్‌’. మిలింద్‌ రావ్‌ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా మొదటి పాట ఒకటి విడుదలైంది. ‘ఇదువం కదందు పోగుమ్‌’ అంటూ సాగే ఈ పాటకి కార్తీక్‌ నేత సాహిత్యం అందించగా ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ శ్రావ్యంగా ఆలపించారు. గిరీష్‌ గోపాలకృష్ణన్‌ సంగీతం సమకూర్చారు. రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్‌ శివన్‌, థామస్ కిమ్, కె.ఎస్.మాయిల్వగనన్ నిర్మించారు. ‘ఇదువం కదందు పోగుమ్‌’ సాంగ్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే వేలల్లో వ్యూస్‌ని సొంతం చేసుకుంది. చిత్రంలో ఇందుజ, అజ్మల్ అమీర్‌, మణికందన్, శరన్ తదితరులు నటించారు. సినిమాకి ఆర్డీ రాజశేఖర్‌ కెమెరామెన్‌గా పనిచేస్తుండగా లార్వెన్స్ కిశోర్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని