‘ఆది పురుష్‌’అప్‌డేట్‌ రానుందా? - prabhas fans trend adipurush on twitter big update coming tomorrow
close
Updated : 18/01/2021 18:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆది పురుష్‌’అప్‌డేట్‌ రానుందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రధానపాత్రలో పాన్‌ఇండియా చిత్రంగా ‘ఆదిపురుష్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే జనవరి 19వ తేది ఉదయం 7.11నిమిషాలకు ‘ఆదిపురుష్‌’కు సంబంధించి కీలకమైన సమాచారాన్ని చితృబృందం చెప్పబోతునట్టు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఇందుకు కారణం చిత్ర నిర్మాత  రాజేష్‌నాయర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో దేవుని చిత్రపటం ఉంచి ‘ఆది పురుష్‌’అని హ్యాష్‌ట్యాగ్‌  ఇవ్వడమే. చిత్రబృందం అందరితో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించేందుకు ఇప్పటికే నిర్మాణ సంస్థ అంతా సిద్ధం చేసింది. దీంతో ప్రభాస్‌ అభిమానులు సినిమాకు సంబంధించి  కీలక సమాచారం రావొచ్చునని భావిస్తున్నారు. ‘తానాజీ’ వంటి చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సినిమాను తెరకెక్కించిన బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 3డీలో తెరకెక్కబోయే ఈ పౌరాణిక చిత్రంలో ప్రభాస్‌ శ్రీరామునిగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణబ్రహ్మగా కనిపించబోతున్నారని ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాథేశ్యామ్‌’సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటూనే, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌తో కలిసి‘సలార్‌’అనే చిత్రానికి సంబంధించి పూజా కార్యాక్రమాన్ని పూర్తిచేశారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నారు.

ఇవీ చదవండి!

రష్మిక.. మాటిస్తున్నా: విజయ్‌దేవరకొండ

‘తాండవ్‌’ మేకర్స్‌పై కేసు నమోదు

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని