మ‌హేశ్‌-రాజ‌మౌళి కాంబో: నిర్మాత ఏమ‌న్నారంటే! - producer kl narayana gave clarity on rajamouli mahesh combo
close
Updated : 02/06/2021 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ‌హేశ్‌-రాజ‌మౌళి కాంబో: నిర్మాత ఏమ‌న్నారంటే!

ఇంట‌ర్నెట్ డెస్క్‌: మ‌హేశ్ బాబు- రాజ‌మౌళి క‌ల‌యిక‌లో ప్ర‌ముఖ నిర్మాత కె.ఎల్‌. నారాయ‌ణ ఓ చిత్రం నిర్మించ‌నున్న సంగతి తెలిసిందే. ఈ విష‌యం తెలిసినప్ప‌టి నుంచే సినీ అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. దాంతో ర‌క‌ర‌కాల ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఆఫ్రికా అడ‌వి నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ డ్రామాగా ఈ క్రేజీ ప్రాజెక్టును తెర‌కెక్కిస్తున్నారంటూ ప్ర‌చారం ఊపందుకుంది. దీనిపై స్పందించారు నిర్మాత నారాయ‌ణ‌. ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... ‘కొన్నేళ్ల‌ క్రిత‌మే మ‌హేశ్‌ బాబు, రాజ‌మౌళి నాతో సినిమా చేస్తాన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం వాళ్ల మార్కెట్ పెరిగినా ఇచ్చిన మాట‌కి కట్టుబ‌డి ఉన్నారు. ఈ ప్రాజెక్టు అడ‌వి నేప‌థ్యంలో సాగే క‌థ అని వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ, అందులో నిజం లేదు. ఈ చిత్ర క‌థ ఇంకా ఖ‌రారు కాలేదు. రాజ‌మౌళి, ఆయ‌న బృందం స్క్రిప్టు ప‌నుల్లో ఉంది’ అని తెలిపారు.

ప్ర‌స్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంతో బిజీగా ఉన్నారు రాజ‌మౌళి. రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘స‌ర్కారు వారి పాట’ చిత్రంతో పాటు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ప్ర‌క‌టించారు మ‌హేశ్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని