‘తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం’ - public health director G srinivas press meet
close
Published : 25/08/2020 14:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం’

ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంపీ పరిధిలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...సెప్టెంబరు నెలాఖరునాటికి రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చే అవకాశముందని చెప్పారు. కొవిడ్‌పై ప్రజల్లో చాలా వరకు అవగాహన పెరిగిందని, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. బయటకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని సూచించారు. కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్‌ను దాదాపు అదుపులోకి తీసుకొచ్చామన్నారు. కరోనా పరీక్షల సంఖ్య గతంలో కంటే పెంచామని, రాష్ట్రంలో ఇప్పటి వరకూ 10.21 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనల మేరకే బిల్లులు వేయాలని, ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందిస్తున్నామని శ్రీనివాసరావు వెల్లడించారు. మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకునే అవకాశముందన్నారు.

తెలంగాణలో కరోనా మరణాల రేటు జాతీయస్థాయి రేటు కన్నా తక్కువగానే ఉందన్నారు. కరోనా నివారణకు చర్యలు తీసుకోవట్లేదని తప్పుడు ప్రచారం చేస్తే బాధనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసకుంటున్నామని తెలిపారు. ఈ సీజన్‌లో చికెన్‌ గున్యా, డెంగీ, టైఫాయిడ్‌, మలేరియా  వంటి సీజనల్‌ జ్వరాలు  ప్రబలే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా, సీజనల్‌ జ్వరాల లక్షణాలు ఒకే విధంగా ఉంటాయని, ఎలాంటి క్షణాలు ఉన్నా సమీపంలోని ప్రభుత్వం ఆరోగ్యకేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని