ప్రతి వాడూ పూరి జగన్నాథ్‌ కాదు కదా..! - rahul ramakrishna and srikanth y trailer released
close
Published : 31/03/2021 19:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతి వాడూ పూరి జగన్నాథ్‌ కాదు కదా..!

హైదరాబాద్‌: ‘పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి సంపాదించడానికి ప్రతి వాడూ పూరి జగన్నాథ్‌ కాదు కదా సర్‌’ అంటున్నారు రాహుల్‌ రామకృష్ణ. నటుడు శ్రీరామ్‌తో కలిసి ఆయన నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘వై’. బాలు అడుసుమిల్లి దర్శకుడు. బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో శ్రీరామ్‌ ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటించారు.

ఆద్యంతం ఉత్కంఠగా సాగే కథా, కథనాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా ఏప్రిల్‌ 2 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఎరుకొండ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎరుకొండ రఘురామ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వికాస్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని