‘విశాఖ వాణి’గా రమ్యకృష్ణ - ramya krishnan character of vishakha vani in repulic movie
close
Published : 03/04/2021 17:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘విశాఖ వాణి’గా రమ్యకృష్ణ

ఇంటర్నెట్‌ డెస్క్: సాయితేజ్‌ కథానాయకుడిగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. ఐశ్వర్య రాజేష్‌ కథానాయిక. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రను పరిచయం చేస్తూ శనివారం ఆమె ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని చిత్రం బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా సాయితేజ్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘లెజెండరీ నటి రమ్యకృష్ణతో కలిసి నటించడం నాకు దక్కిన గౌరవం. విశాఖ వాణి పాత్రలో రమ్యకృష్ణ నటనను చూపించడానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నా’’అంటూ పేర్కొన్నారు.

ఈ సినిమాలో సాయితేజ్‌ ‘అభి’ పాత్రలో నటిస్తున్నారు. ‘‘తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం!’’ అంటూ రమ్యకృష్ణ తీక్షణమైన చూపులతో కూడిన పోస్టర్‌ను చిత్ర బృందం పంచుకుంది. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై భగవాన్‌, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌4న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని