WTC Final: ఉత్తమ జట్టే గెలిచిందన్న రవిశాస్త్రి - ravi shastri feels better team won the wtc finals
close
Published : 24/06/2021 17:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WTC Final: ఉత్తమ జట్టే గెలిచిందన్న రవిశాస్త్రి

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఉత్తమ జట్టే విజేతగా నిలిచిందని టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గురువారం ఓ ట్వీట్‌ చేస్తూ ఈ విషయాన్ని పేర్కొన్నాడు. గొప్ప విజయాలు అంత తేలిగ్గా రావనడానికి ఈ మ్యాచే నిదర్శనమని చెప్పాడు. బుధవారం రాత్రి రిజర్వ్‌డే రోజు టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దాంతో కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు మరోసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడే అవకాశాన్ని కోల్పోయింది.

‘ప్రతికూల పరిస్థితుల్లో ఉత్తమ జట్టే విజేతగా నిలిచింది. ఐసీసీ ట్రోఫీ కోసం ఎంతోకాలం వేచిచూసిన న్యూజిలాండ్‌ ఈ విజయం సాధించడానికి అర్హమైనదే. గొప్ప విజయాలు అంత తేలిగ్గా రావనడానికి ఇదే సరైన నిదర్శనం. విలియమ్సన్‌ టీమ్ బాగా ఆడింది. అందుకు గౌరవిస్తున్నా’ అని శాస్త్రి ట్వీట్‌ చేశాడు. కాగా, న్యూజిలాండ్‌ 2000 సంవత్సరంలో చివరిసారి ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించింది. ఆ తర్వాత 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో ఫైనల్‌కు చేరినా విజేతగా నిలవలేకపోయింది. మరీ ముఖ్యంగా 2019 ఫైనల్లో ఇంగ్లాండ్‌తో తలపడిన సందర్భంగా ఇరు జట్లూ తొలుత 241 పరుగులు చేసి సమానంగా నిలిచాయి. సూపర్‌ ఓవర్‌లోనూ మళ్లీ 15 పరుగుల సమాన స్కోర్లు సాధించారు. అయితే, ఆ మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టినకారణంగా ఇంగ్లిష్‌ జట్టును విజేతగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్‌ ఇప్పుడు ఐసీసీ ట్రోఫీ సొంతం చేసుకోవడం విశేషంగా మారింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని