Manchu Manoj: మరోసారి తెరపైకి మనోజ్‌ రెండో పెళ్లి.. షాక్‌లో హీరో..! - telugu news manchu manoj smart comments on his wedding news
close
Published : 27/10/2021 11:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Manchu Manoj: మరోసారి తెరపైకి మనోజ్‌ రెండో పెళ్లి.. షాక్‌లో హీరో..!

హైదరాబాద్‌: విడాకుల అనంతరం సింగిల్‌గా ఉన్న నటుడు మంచు మనోజ్‌ త్వరలో మరోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ విదేశీ యువతిని ఆయన పెళ్లి చేసుకోనున్నారని.. అందుకు కుటుంబసభ్యులు సైతం పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయ్యారని గత కొన్నిరోజుల నుంచి వరుస కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై తాజాగా మంచు మనోజ్‌ షాక్‌కు గురయ్యారు. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పేశారు. ‘‘దయచేసి.. నన్ను కూడా పెళ్లికి పిలవండి. ఇంతకీ పెళ్లి ఎక్కడ చేస్తున్నారు? ఆ బుజ్జి, తెల్ల పిల్ల ఎవరు?! మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం!!’’ అని మనోజ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో మనోజ్‌ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టత వచ్చింది.

హైదరాబాద్‌కు చెందిన ప్రణతీరెడ్డితో 2015లో మనోజ్‌ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ 2019లో వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఆనాటి నుంచి మనోజ్‌ రెండో పెళ్లి చేసుకోనున్నారంటూ ఎన్నో సార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక, సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో మనోజ్‌ విభిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని